అంతర్జాతీయ టీటీ టోర్నీకి నైనా | naina elected to international table tennis tourney | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ టీటీ టోర్నీకి నైనా

Published Tue, Nov 26 2013 3:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అంతర్జాతీయ టీటీ టోర్నీకి నైనా - Sakshi

అంతర్జాతీయ టీటీ టోర్నీకి నైనా

సాక్షి, హైదరాబాద్:  ఫజార్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు జాతీయ సబ్ జూనియర్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ టీటీ యువ తార నైనా జైస్వాల్ ఎంపికైంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఈనెల 28 నుంచి 30 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 13 ఏళ్ల నైనా గత మూడేళ్లుగా జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో విజేతగా నిలుస్తోంది. జాతీయస్థాయిలో నైనా కనబరుస్తోన్న స్థిరమైన ప్రదర్శన ఆధారంగా ఆమెకు భారత జట్టులో చోటు లభించింది. మూడు రోజులపాటు జరిగే ఫజార్ కప్‌లో జూనియర్ బాల బాలికల టీమ్, సింగిల్స్, డబుల్స్ విభాగాలలో... క్యాడెట్ బాల బాలికల సింగిల్స్ విభాగాలలో పోటీలుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement