సాక్షి, హైదరాబాద్: ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నైనా, మోమిత దత్తాలతో కూడిన భారత బాలికల క్యాడెట్ జట్టు విజేతగా నిలిచింది.
ఫైనల్లో భారత్ 3-0 తేడాతో ఆతిథ్య ఇరాన్‌ను ఓడించింది. రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గిన నైనా, మోమిత... జోడిగా దిగిన డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిచారు. అంతకుముందు సెమీఫైనల్లో నైనా బృందం 3-0తో జోర్డాన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు అజర్‌బైజాన్, తుర్క్‌మెనిస్థాన్, జోర్డాన్, ఇరాన్, బెలారస్, హంగేరి తదితర జట్లు పాల్గొన్నాయి.
నైనా జోడికి స్వర్ణం
Published Sat, Nov 30 2013 12:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement