ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ చేసింది. మంగళవారం జరిగిన 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ మలిక్ శుభారంభం చేశాడు.
అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ చేసింది. మంగళవారం జరిగిన 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ వికాస్ మలిక్ శుభారంభం చేశాడు. మెదార్ మమకీవ్ (కిర్గిజిస్థాన్)తో జరిగిన తొలి రౌండ్‌లో వికాస్ 3-0 (29-28, 29-28, 30-27)తో విజయం సాధించాడు.
నిర్ణీత మూడు రౌండ్లలోనూ వికాస్ ప్రత్యర్థిపై ఆధిక్యంలో నిలిచాడు. 20న జరిగే రెండో రౌండ్‌లో అతను మిచెలుస్ (పోలాండ్)తో తలపడతాడు. సోమవారం జరిగిన 52 కేజీల తొలి రౌండ్‌లో భారత బాక్సర్ మదన్‌లాల్ 0-3తో రిస్కాన్ (మాల్దోవా) చేతిలో ఓడిపోయాడు.