నీరజ్ భారత 'బంగారం' | Neeraj Chopra wins javelin gold with new U-20 World Record | Sakshi
Sakshi News home page

నీరజ్ భారత 'బంగారం'

Published Sun, Jul 24 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

నీరజ్ భారత 'బంగారం'

నీరజ్ భారత 'బంగారం'

జావెలిన్‌ త్రోలో ప్రపంచ రికార్డు
అథ్లెటిక్స్‌లో ఓ భారతీయుడికి తొలిసారి స్వర్ణం


బెంగళూరు:
అథ్లెటిక్స్ లో భారత్ సాధారణంగా ఏదైనా ట్రాక్ లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే గొప్ప విషయంగా భావిస్తుంటాం. కానీ 'జావెలిన్‌ త్రో'లో హరియాణాకు చెందిన నీరజ్‌ చోప్రా ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. పోలెండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్‌ వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్లు జావెలిన్‌ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గాడు. స్వర్ణం నెగ్గడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జోహాన్‌ గ్రాబ్లర్‌, గ్రెనెడా ఆటగాడు అండర్సన్‌ పీటర్స్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గ్రాబ్లర్ 80.59 మీటర్లు విసిరి రజతం సొంతం చేసుకోగా, అండర్సన్‌ 79.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరి కాంస్యం చేజిక్కుంచుకున్నాడు.


మొదటి ప్రయత్నంలో నీరజ్ 79.66 మీటర్లు జావెలిన్‌ విసరగా, గ్రాబ్లర్ 80.59మీటర్ల దూరం విసిరాడు. దీంతో రెండో ప్రయత్నంలో 86.48 మీటర్లు విసిరి ఏకంగా  ప్రపంచ రికార్డును సవరించాడు. గతంలో ఈ రికార్డు లాత్వియాకు చెందిన జిగిస్మండ్స్‌ సిర్మాయిస్ పేరిట ఉండేది. 2011లో సిర్మాయిస్ విసిరిన 84.69 మీటర్లే ఇప్పటివరకూ అత్యధికం. మూడో ప్రయత్నంలో 78.36 మీటర్లు విసిరిన నీరజ్, చివరి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు.



మరిన్ని అంశాలు:

  • ఐఏఏఎఫ్‌ వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్లు జావెలిన్‌ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గాడు.
  • నీరజ్‌కు, రెండో స్థానంలో నిలిచిన గ్రాబ్లర్‌కు జావెలిన్  తేడా దాదాపు 6 మీటర్లు ఉండటం విశేషం.
  • లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన ప్లేయర్ 84.58 మీటర్లు జావెలిన్‌ విసిరాడు.
  • ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్‌ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.  
  • ఇటీవల వార్సాలో జరిగిన ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలో నీరజ్ త్రుటిలో స్వర్ణం కోల్పోయాడు. 79.73 మీటర్లతో రజతం నెగ్గాడు. స్వర్ణం చేజిక్కుంచుకుని ఉంటే ఒలింపిక్స్‌లో పాల్గొనేవాడు.
  • 14 ఏళ్ల వయసులోనే 68.4 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి నేషనల్ రికార్డు బద్దలుకొట్టాడు.
  • గతేడాది డిసెంబర్ లో పాటియాలలో జరిగిన ఇంటర్ వర్సిటీ చాంపియన్షిప్ లో 81.04మీటర్లు విసిరి జాతీయ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు.
  • 2002లో సీమా ఆంటిల్, రెండేళ్ల కిందట నవజీత్ కౌర్ థిల్లాన్ కూడా రజతం సాధించారు. భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి జావెలిన్ త్రోయర్గానూ నీరజ్ సంచలనం సృష్టించాడు.


     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement