ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్ రనౌట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకంగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ రెండు ప్రధాన వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. గప్టిల్ రనౌటైన కాసేపటికి కివీస్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను నష్టపోయింది. గప్టిల్ పెవిలియన్‌కు చేరిన తర్వాత టామ్ లాథమ్(7)ను ఎల్బీగా ఎల్బీగా ఔట్ చేసి రవీంద్ర జడేజా బ్రేక్ ఇవ్వగా. ఆపై కాసేపటికి జేమ్స్ నీషమ్(3)ను జడేజా రనౌట్ చేసి శభాష్ అనిపించాడు. గప్టిల్ రనౌట్‌లో భాగమైన రాస్ టేలర్.. మరో రనౌట్‌లో కూడా పాలుపంచుకున్నాడు. (ఇక్కడ చదవండి: అయ్యో గప్టిల్.. ఎంత పొరపాటాయే!)
నవదీప్ సైనీ వేసిన 35 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి షార్ట్ ఆడాడు. దాంతో సింగిల్‌కు యత్నించగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా డైరెక్ట్ త్రో విసిరి స్ట్రైకర్స్ ఎండ్‌లోని బెయిల్స్ పడగొట్టాడు. నీషమ్ క్రీజ్‌లోకి రావడానికి చాలా దూరంలో ఉండగానే జడేజా వేసిన అద్భుతమైన త్రోకు కివీస్ మరో మూల్యాన్ని చెల్లించుకుంది. దాంతో టీమిండియా సంబరాలు చేసుకోగా, రెండో రనౌట్‌తో కివీస్ శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. ఆపై గ్రాండ్ హోమ్(5)ను శార్దూల్ ఔట్ చేయగా, మార్క్‌చాప్‌మన్(1)ను చహల్ పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా న్యూజిలాండ్ 187 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment