అడిలైడ్: టీమిండియాతో మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగిన క్రమంలో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకోవడం పట్ల ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోహ్లి అతి చేశాడంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో తమ జట్టు ఆటగాళ్లు విరాట్‌లా చేస్తే అత్యంత మొరటవాళ్లుగా క్రికెట్ ప్రపంచం పేర్కొంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దీనిపై సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలతో లాంగర్ సానుభూతి పొందలేడంటూ ఘాటుగా బదులిచ్చాడు.
‘విరాట్ అలా సంబరాలు చేసుకోవడం, నాకు తప్పుగా ఏం అనిపించలేదు. అది అతడికి ఆటపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. ఆసీస్ ఆటగాళ్లు దుర్భాషలాడుతూ సంబరాలు చేసుకుంటారు. అందుకే ఆస్ట్రేలియా జట్టుకు చెడ్డ పేరుంది. లాంగర్ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటిదేమీ జరగదు’ అని గావస్కర్ అన్నాడు.
అంతకముందు లాంగర్ మాట్లాడుతూ.. ‘కోహ్లి ఒక సూపర్ స్టార్. అంతేకాదు ఓ జట్టుకు కెప్టెన్ కూడా. అలాంటి ఆటగాడు ఇలా ప్రవర్తించడం సరికాదు. మేం కూడా అలా చేస్తే, ప్రపంచం ముందు అత్యంత మొరటవాళ్లుగా మిగిలిపోతాం’ అంటూ కోహ్లిని ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. దీనిపై ఇప్పటికే స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్.. ‘ కోహ్లిపై ‘మొరటితనం’ వ్యాఖ్యలు మాని క్రికెట్‌పై దృష్టి పెడితే ఆసీస్‌కు మంచిదంటూ చురకలంటించాడు. (మేము కోహ్లిలా మొరటోళ్లం కాదు!)
Comments
Please login to add a commentAdd a comment