
సిమోనా హలెప్, నయోమి ఒసాకా
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జపాన్ యువతార నయోమి ఒసాకా తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 20 ఏళ్ల ఒసాకా 6–3, 6–0తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
తొలి రౌండ్‌లో మాజీ నంబర్‌వన్ షరపోవా (రష్యా)పై, రెండో రౌండ్‌లో 31వ ర్యాంకర్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గిన ఒసాకా కెరీర్‌లో అతి పెద్ద టైటిల్‌కు మరో విజయం దూరంలో ఉంది. మరో సెమీఫైనల్లో దరియా కసత్‌కినా (రష్యా) 4–6, 6–4, 7–5తో మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించి ఒసాకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment