
ఓడిపోవడం బాధగా ఉంది: ధోని
మిర్పూర్: బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు కారణంగానే తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. స్లో వికెట్ పిచ్ పై పరిస్థితులను బంగ్లా పేసర్లు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని విశ్లేషించాడు. తమ బౌలర్లతో పోల్చుకుంటే బంగ్లా బౌలర్లు వైవిధ్యం కనబరిచారని మెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఓడిపోవడం బాధ కలిగించిందని మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని వ్యాఖ్యానించాడు. అయితే జరిపోయిన దాని గురించి తలుచుకంటూ కూర్చోమని చెప్పాడు. మ్యాచ్ జరిగిన రోజున ఎలా ఆడామన్నదే ప్రాధానమన్నాడు. ఈరోజు తమకంటే బంగ్లాదేశ్ బాగా ఆడిందని చెప్పాడు. 300 పైచిలుకు టార్గెట్ ను చేరుకోవాలంటే కచ్చితంగా మంచి భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఆర్డర్ భారీ భాగస్వామ్యం నమోదైవుంటే లక్ష్యాన్ని ఛేదించడం సులువు అవుతుందని ధోని చెప్పాడు.