న్యూఢిల్లీ : అసలే అది పాకిస్తాన్.. ఆపై ఓ మ్యాచ్ గెలిచింది.. వర్షం కారణంగా ఆట రద్దవడంతో మరో పాయింట్ కూడా ఖాతాలో పడింది. ఇంకేముంది కప్పుపై కన్నేసింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చేతిలో నుంచి టీకప్పు లాక్కెళ్లిపోయింది. అవును ఇది నిజం. దానికి సంబంధించిన విశేషాలు..! ప్రపంచకప్‌లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య వచ్చే ఆదివారం (జూన్ 16) మ్యాచ్ జరుగనుంది. అయితే, పాక్ చేతిలో టీమిండియా ఓటమి ఖాయమన్న తీరులో జాజ్ టీవీ ఓ యాడ్ రూపొందించి విమర్శలపాలైంది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గన్‌స్లింగర్ మీసంతో ఉండే అభినందన్ ఆహార్యం అందరికీ సుపరిచితమే.
ఇక 33 సెకండ్ల నిడివి గల యాడ్‌లోని అంశాలు.. ‘అభినందన్ వేషధారణతో, టీమిండియా జెర్సీతో ఓ వ్యక్తి విచారణ గదిలో ఉంటాడు. మీ జట్టు టాస్ గెలిస్తే ఏం చేస్తుంది..ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి బదులిస్తాడు. పైనల్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారు అని మళ్లీ ప్రశ్నిస్తారు. ఐయామ్ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి అంటాడు. చివరలో టీ ఎలా ఉంది అనే ప్రశ్నకు.. చాలా బాగుంది అంటాడు. ఇక నువ్ వెళ్లొచ్చు అనగానే.. అక్కడ నుంచి ముందుకు కదులుతాడు. అంతలోనే... కప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.. అని చేతిలో నుంచి లాక్కుంటారు’. ఇదిలాఉండగా.. జాజ్ టీవీ అత్యుత్సాహంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని టీ కప్పులు కావాలో తీస్కోండి అని చురకలంటిస్తున్నారు. వచ్చే ప్రపంకప్‌నకు సంబంధించి కూడా మరిన్ని కప్పులు కావాలంటే తీస్కోండని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయింది.
(చదవండి : వాళ్లతోనే కలిసి ఉంటా; అభినందన్ అంకిత భావం)
Jazz TV advt on #CWC19 takes the Indo-Pak air duel to new level. It uses the air duel over Nowshera and Wing Co Abhinandan Varthaman's issue as a prop. @IAF_MCC @thetribunechd @SpokespersonMoD @DefenceMinIndia pic.twitter.com/30v4H6MOpU
— Ajay Banerjee (@ajaynewsman) June 11, 2019
Comments
Please login to add a commentAdd a comment