
కేప్‌టౌన్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 208 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్ సేన 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత తన రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే చాపచుట్టేయడంతో ఘోర పరాజయం తప్పలేదు. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్(13),శిఖర్ ధావన్(16), చతేశ్వర పుజారా(4), విరాట్ కోహ్లి(28), రోహిత్ శర్మ(10), సాహా(8), హార్దిక్ పాండ్యా(1)లు నిరాశపరిచారు. కాగా, రవిచంద్రన్ అశ్విన్(37), భువనేశ్వర్ కుమార్(13)ల పోరాటం ఆకట్టుకుంది. వీరిద్దరూ పది ఓవర్లకు పైగా క్రీజ్‌లో నిలబడి ఎనిమిదో వికెట్‌కు 49 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించినా అప‍్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ ఆరు వికెట్లు సాధించి భారత పతనాన్ని శాసించాడు. అతనికి జతగా మోర్కెల్, రబడాలు తలో రెండు వికెట్లు సాధించారు.
స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు.. మరో 65 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. దాంతో సఫారీలకు 207 పరుగుల ఆధిక్యం లభించింది. దీన్ని కాపాడుకునే క్రమంలో విజృంభించిన సఫారీలు విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment