సెంచూరియన్:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయారు. దాంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ రోజు ఆటలో డివిలియర్స్(80;121 బంతుల్లో 10 ఫోర్లు), డీన్ ఎల్గర్ (61;121 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్), డీకాక్(12; 5 బంతుల్లో 3 ఫోర్లు)లను స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా, డు ప్లెసిస్(48;141 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. డు ప్లెసిస్‌కు ఫిలిండర్(26;85 బంతుల్లో 2 ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి ఆరో వికెట్‌కు 46 పరుగుల్ని భాగస్వామ్యాన్ని సాధించగా, అటు తరువాత డు ప్లెసిస్- రబడా(29 బంతుల్లో 4) ల జోడి 30 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. టీమిండియా బౌలర్లలో మొహ్మద్ షమీ నాలుగు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు వికెట్లు తీశాడు. ఇక ఇషాంత్ శర్మ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment