
ముంబై: క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల జట్టులో కొండంత ఆత్మవిశ్వాసం నింపాడు సచిన్ టెండూల్కర్. ఈ బ్యాటింగ్ దిగ్గజం సోమవారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మిథాలీ రాజ్ బృందంతో భేటీ అయ్యాడు. విశేషానుభవం ఉన్న ‘మాస్టర్’ సుమారు గంటకుపైగా వారితో ముచ్చటించాడు.
అనవసర ఒత్తిడిని తలకెత్తుకోకుండా సానుకూల దృక్పథంతో ఆడాలని సూచించాడు. సఫారీ పిచ్‌లపై ఎలా సన్నద్ధం కావాలో వివరించాడు. అక్కడి పరిస్థితుల గురించి ఆం దోళన చెందాల్సిన పనిలేదన్నాడు. పొరపాట్లకు తావివ్వకుండా ఆడాలని చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్‌లో తలపడుతుంది.