సాక్షి, హైదరాబాద్: ‘వాకో’ ప్రపంచకప్ డైమండ్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు పసిడి పంచ్‌తో సత్తా చాటారు. రష్యా లోని అనపా నగరంలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన ఎం. ప్రవీణ్ కుమార్ సీనియర్ పురుషుల విభాగంలో, కందుల మౌనిక వెపన్ సాఫ్ట్ స్టయిల్ డివిజన్‌లో చాంపియన్‌లుగా నిలిచి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. వీటితో పాటు ప్రవీణ్ లైట్ కాంటాక్ట్ ఫైట్ కేటగిరీలో, మౌనిక 50 కేజీల పాయింట్ ఫైటింగ్ విభాగాల్లో కాంస్య పతకాలనూ గెలుచుకున్నారు.
ఇదే టోర్నీలో తెలంగాణకే చెందిన ఆర్. సంజు రజతాన్ని దక్కించుకోగా... షేక్ మొహమ్మద్ అశ్వక్, బి. మహేశ్ చెరో కాంస్యాన్ని సాధించారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించిపెట్టిన రాష్ట్ర క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కిక్‌బాక్సింగ్ సంఘం కార్యదర్శి మహిపాల్, రంగారెడ్డి జిల్లా కిక్‌బాక్సింగ్ సంఘం అధ్యక్షులు నర్సింగ్ రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment