పోరాడి ఓడిన సింధు | PV Sindhu, Parupalli Kashyap lose in semis; Saina Nehwal out in quarters at Swiss Open | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సింధు

Published Sun, Mar 16 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

పోరాడి ఓడిన సింధు

పోరాడి ఓడిన సింధు

 స్విస్ ఓపెన్ టోర్నీ
 బాసెల్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ పి.వి.సింధు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో పోరాడి ఓడింది. శనివారం జరిగి న మహిళల సెమీఫైనల్లో ఏడోసీడ్ సింధు 21-18, 12-21, 19-21తో సున్ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో గేమ్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాద్ అమ్మాయి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే చివర్లో నెట్ వద్ద విఫలం కావడంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
 

 పురుషుల సెమీస్‌లో పారుపల్లి కశ్యప్  17-21, 11-21తో హూవీ తియాన్ (చైనా) చేతిలో ఓడాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆరోసీడ్ సైనా నెహ్వాల్ 17-21, 12-21తో ప్రపంచ మూడో ర్యాంకర్, టాప్‌సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడింది. 38 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిగేమ్‌లో 14-14 స్కోరు వరకు సైనా గట్టిపోటీ ఇచ్చినా ఆ తర్వాత క్రమంగా వెనుకబడింది. రెండో గేమ్‌లో 5-9, 8-9తో వెనుకబడి ఆ తర్వాత పుంజుకోలేకపోయింది. వాంగ్ చేతిలో సైనా ఓడటం ఇది ఏడోసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement