ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు | Saina and Sindhu entered pre-quarter-final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు

Published Thu, Jun 26 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

Saina and Sindhu entered pre-quarter-final

ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్
 సిడ్నీ: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్,  పీవీ సింధు... ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్, ఆరోసీడ్ సైనా 22-24, 21-17, 21-10తో అన్‌సీడెడ్ సన్ యు (చైనా)పై నెగ్గగా... 8వ సీడ్ సింధు 21-16, 21-14తో య ఓహోరి (జపాన్)ను అలవోకగా ఓడించింది మరో మ్యాచ్‌లో పి.సి.తులసీ 21-16, 21-18తో జెమీ సుబంది (అమెరికా)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో సైనా... తులసీతో; సింధు... నికాన్ జిందాపాన్ (థాయ్‌లాండ్)తో తలపడతారు.
 
 సాయిప్రణీత్ విజయం: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయి ప్రణీత్ 21-7, 21-11తో హోయ్ కీట్ వూన్ (ఆస్ట్రేలియా)పై గెలవగా... హెచ్.ఎస్. ప్రణయ్ 14-21, 18-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 21-16, 21-16తో టెరీ హీ-డెరెక్ వాంగ్ (సింగపూర్)పై; అల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు 21-7, 21-11తో ఫరిమన్ (ఆస్ట్రేలియా)-రేహాన్ (ఇండోనేసియా)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement