రఫెల్ నాదల్ కు స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్!
బార్సిలోనా: టెన్నిస్ సూపర్ స్టార్ రఫెల్ నాదల్ స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్ తీసుకోనున్నాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న నాదల్ ట్రీట్ మెంట్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అతని వ్యక్తిగత డాక్టర్ ఎంజేల్ రూయిజ్ కటోర్రో స్పష్టం చేశాడు. ఈ కారణంతోనే నాదల్ గత కొన్ని రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు.
14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన నాదల్ ట్రీట్ మెంట్ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి తిరిగి టెన్నిస్ బరిలోకి దిగే అవకాశం ఉందన్నాడు.