ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.
ఇండోర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆదిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ వరుసగా వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. 18 పరుగులకే ఓపెనర్లు షేన్ వాట్సన్(1), విష్ణు వినోద్(7) వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ.. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో కేదర్ జాదవ్(1)వికెట్ ను నష్టపోయింది. దాంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు నుంచి క్రిస్ గేల్ ను తప్పించారు. అతని స్థానంలో ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్ ల్లో గేల్ నిరాశపరచడంతో అతన్ని రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు.