
మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6–0, 6–4తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. సెమీస్‌లో కెనడా యువ సంచలనం డెనిస్ షపోవలోవ్‌తో ఫెడరర్ ఆడతాడు. క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–7 (5/7), 6–4, 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు.