హార్దిక్‌ నువ్వెందుకలా?: రోహిత్‌ శర్మ | Rohit Sharma Engages in Hilarious Twitter Banter | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ నువ్వెందుకలా?: రోహిత్‌ శర్మ

Published Fri, Mar 23 2018 2:06 PM | Last Updated on Fri, Mar 23 2018 2:06 PM

Rohit Sharma Engages in Hilarious Twitter Banter - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రారంభానికి ముందే కావాల్సినంత వినోదం పంచడానికి సిద్ధమయ్యారు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మఅండ్‌ గ్యాంగ్‌. ఏప్రిల్‌ 7న ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌ 11లో అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ముంబై ఫ్రాంచైజీ తమ స్టార్‌ ఆటగాళ్ల ప్రత్యేక ఎమోజీలను రూపొందించింది. అయితే ఈ విషయాన్ని గురించి అధికారికంగా ప్రకటించలేదు. ముంబై టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గ్యాంగ్‌ సరదాగా చేస్తున్న ట్వీట్లు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

‘మన టీమ్‌లో చేరిన కొత్త ముఖాలకు స్వాగతం పలకండి’ అని పరోక్షంగా ఎమోజీల గురించి ముంబై టీమ్‌ ట్వీట్‌ చేయగా.. ‘కొత్త ముఖాలు అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? అయినా నాకెందుకు ముందుగా చెప్పలేదు’  అంటూ రోహిత్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. అందుకు ప్రతిగా.. ‘కెప్టెన్‌ ఈ విషయం గురించి మీరు ఒకసారి చెక్‌ చేసుకోండి’  అని టీమ్‌ ట్వీట్‌ చేయగా.. నేను చెక్‌ చేశాను. ‘ఈ కొత్త ముఖాలు చాలా కూల్‌గా ఉన్నాయి. కానీ నా బుల్లెట్స్‌ ఎక్కడ’  అంటూ రోహిత్‌ ప్రశ్నించాడు.

అంతేకాకుండా.. ‘హార్దిక్‌ పాండ్యా జుట్టుకు ఏమైంది. ఎందుకు తాను అలా మండిపోతున్నాడు’ అంటూ ట్వీట్‌ చేశాడు. వెంటనే హార్దిక్‌ కూడా ఈ సరదా సంభాషణలో జాయిన్‌ అయ్యాడు. ‘నాలో ఎప్పుడూ భావోద్వేగాలతో కూడిన ఫైర్‌ రగులుతూనే ఉంటుంద’ని ట్వీట్‌ చేశాడు. ‘మరి బుమ్రా, పొలార్డ్‌ ఇంకా మిగతా వాళ్లెక్కడా’  అంటూ రోహిత్‌ ప్రశ్నించగా..‘పొలార్డ్‌ ఇప్పుడే ముంబైకి బయల్దేరాడు’ అంటూ సమాధానం వచ్చింది. ఈలోపు బుమ్రా ఎంట్రీ ఇచ్చి ‘నేను బౌలింగ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement