ముంబై: శ్రీలంకతో జరిగిన మూడో టీ 20లో 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో టీమిండియా చివరి వరకూ పోరాడి విజయాన్ని అందుకుంది. ఇంకా నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉండగా భారత్ గెలుపొంది సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా తడబాటుకు గురైందనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ విభేదించాడు. తమ జట్టు ఎంతటి టార్గెట్‌నైనా సాధించే సత్తా ఉందని మ్యాచ్ అనంతరం తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన‍్నాడు.
'మా జట్టులో ఆరుగురి స్పెషలిస్టు బ్యాట్స్‌మన్లు ఉన్నారు. దాంతో పాటు ఒక ఆల్ రౌండర్ కూడా మా సొంతం. అంటే ఏడుగురు బ్యాట్స్‌మెన్ జట్టుతో ఉన్నారు. దాంతో ప్రత్యర్థి జట్టు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించినా మా ఆటగాళ్లు ఛేదిస్తారు. ఈ సిరీస్‌లో మా జట్టు సరైన కాంబినేషన్లతో పోరుకు సిద్దమైంది. వరుస సిరీస్ విజయాల్లో మా సమష్టి కృష్టి కనబడుతోంది. ప్రతీ ఒక్కరూ శ్రమించి సిరీస్ విజయాల్ని సాధించడంలో సహకరించారు. లంకతో టీ 20 సిరీస్ పలువురు యువ క్రికెటర్లకు తొలి గేమ్ కాగా, మరి కొందరికి రెండో గేమ్ మాత్రమే. వారంతా ఆత్మవిశ్వాసంతో జట్టు మేనేజ్‌మెంట్ అప్పజెప్పిన పనిని సమర్దవంతంగా పూర్తి చేశారు' అని రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment