పూణే: ఐపీఎల్-8 లో భాగంగా మహారాష్ర్ట క్రికెట్ సంఘం మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి.
ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగిన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ సాగేకొద్దీ క్రమంగా తడబడి చివరి మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌కు చేరింది. మరోవైపు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సునాయాసంగానే నాకౌట్ దశకు వచ్చింది. అయితే తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్ ఆడే స్థితిలో ఉన్న కోహ్లి సేన... వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేటర్ ఆడబోతోంది. గెలిచిన జట్టు రేసులో మిగులుతుంది. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. నేడు జరిగే ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ధోనిసేన తలపడుతుంది.
రాజస్తాన్ రాయల్స్: స్మిత్ (కెప్టెన్), రహానే, వాట్సన్, శామ్సన్, నాయర్, ఫాల్క్‌నర్, హుడా, బిన్నీ, మోరిస్, కులకర్ణి, తాంబే.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, మన్‌దీప్, కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, హర్షల్, చాహల్, అరవింద్.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నబెంగళూరు
Published Wed, May 20 2015 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement