ప్రణవ్కు సచిన్ అభినందన | Sachin Tendulkar Hails Pranav Dhanawade on Scoring 1000 Runs in an Innings | Sakshi
Sakshi News home page

ప్రణవ్కు సచిన్ అభినందన

Published Tue, Jan 5 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

ప్రణవ్కు సచిన్ అభినందన

ప్రణవ్కు సచిన్ అభినందన

ముంబై: క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందలతో ముంచెత్తాడు.అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరును లిఖించుకున్న సచిన్.. ప్రణవ్ వెయ్యి పరుగుల రికార్డుకు  ముగ్ధుడయ్యాడు. ఒక రికార్డుల వేటలో అపారమైన స్వీయ అనుభవం ఉన్న సచిన్.. ప్రణవ్ రికార్డు వెనుక అపారమైన కృషి దాగి వుందని కొనియాడాడు.  ' అజేయంగా 1000 పరుగులకు పైగా చేసి  అన్ని స్థాయి క్రికెట్ రికార్డులను తిరగరాశావు. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నీ కృషే నీకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. నీవు ఇంకా ఎన్నో మైలు రాళ్లు అధిగమిస్తూ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నా'అని సచిన్ ట్వీట్ లో పేర్కొన్నాడు.



ముంబై క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో అజేయంగా 1009  పరుగుల ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో పరుగుల వరద పారించాడు. తొలిరోజు 78 ఫోర్లు, 30 సిక్సర్లు సాయంతో 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్వాడే.. రెండో రోజు మరో 29 సిక్సర్లు, 51 ఫోర్లతో చెలరేగిపోయి అజేయంగా నిలిచాడు. అనంతరం ప్రణవ్  ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీ గాంధీ స్కూల్ 1465 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement