క్రికెట్ చరిత్రలోనే కీలక ఘట్టమిది
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘సచిన్‌కు లభిస్తున్న వీడ్కోలు ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఎవరికీ లభించలేదు. ఎవరి రిటైర్మెంటైనా విచారం కలిగిస్తుంది.
ఈనెల 18 తర్వాత సచిన్ టెండూల్కర్ క్రీజులో కనిపించడు. కాబట్టి ప్రస్తుత హడావిడి అర్థం చేసుకోదగిందే. సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత సచిన్ గొప్ప ఆటగాడు. అలాగే అతడి రిటైర్మెంట్ కూడా అదే స్థాయిలో ఉంది. అలాగే మీడియా ఎప్పుడూ అతడి రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు చేస్తూ వచ్చింది. వారికి నేను చెప్పేది ఒకటే. అతడు ఆట నుంచి తప్పుకున్నాక గానీ మీరేం కోల్పోతారో అర్థం కాదు’ అని గవాస్కర్ అన్నారు.