కామన్వెల్త్‌ గేమ్స్‌: ఫైనల్‌లో సైనా Vs సింధు | Saina, sindhu, Srikanth enter singles final  | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ గేమ్స్‌: ఫైనల్‌లో సైనా Vs సింధు

Published Sat, Apr 14 2018 12:37 PM | Last Updated on Sat, Apr 14 2018 2:25 PM

Saina, sindhu, Srikanth enter singles final  - Sakshi

గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరు జరుగనుంది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒకే కోర్టులో తలపడనున్నారు. సెమీ ఫైనల్లో తమ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ స్టార్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఖాతాలో స్వర్ణం, రజతం పతకాలు ఖాయమయ్యాయి. అయితే ఫైనల్‌లో ఎవరికి ఏ పతకం వరించనుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. 

హోరా హోరిగా సాగిన సెమీస్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా స్కాంట్లాండ్‌ ఫ్లేయర్‌ క్రిస్టీ గిల్మోర్‌ పై 21-14,18-21, 21-17 తో నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో ఒలిపింక్‌ పతక విజేత సింధు 21-18, 21-8 తేడాతో కెనడా క్రీడాకారిణి మైఖేల్‌ లీపై విజయం సాధించి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 

మరోవైపు ప్రపంచ నంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ కూడా ఫైనల్‌ కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీఫైనల్‌లో శ్రీకాంత్‌ 21-10, 21-17 తో ఇంగ్లండ్ క్రీడాకారుడు రాజివ్ ఔసెఫ్‌పై విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశించాడు. మరో పురుషుల సెమీస్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో భారత్‌కే చెందిన ప్రణయ్‌ 16-21, 21-9, 14-21 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్‌, మలేషియా ఆటగాటు చాంగ్‌ వీ లీ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఫైనల్స్‌లో శ్రీకాంత్‌, చాంగ్‌ వీలీతో తలపడనున్నాడు.

కాగా ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డిలకు ఈ సారి నిరాశ ఎదురైంది. మలేసియా జోడీ మేయి కౌన్ చౌ, వివియాన్ హూలపై 21-17, 15-21, 4-21 తేడాతో పరాజయం పొందిన ఈ భారత జోడీ... ఇవాళ సాయంత్రం కాంస్య పతకం కోసం తలపడనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement