ఆసియా టీటీ పోటీలకు నైనా, శ్రీజ, స్నేహిత్ | saina, sreeja, snehith qualifies for asian TT competition | Sakshi
Sakshi News home page

ఆసియా టీటీ పోటీలకు నైనా, శ్రీజ, స్నేహిత్

Published Thu, Sep 11 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

ఆసియా టీటీ పోటీలకు నైనా, శ్రీజ, స్నేహిత్

ఆసియా టీటీ పోటీలకు నైనా, శ్రీజ, స్నేహిత్

ముంబై: ప్రతిష్టాత్మక ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్ల తరఫున హైదరాబాద్ క్రీడాకారులు నైనా జైస్వాల్, ఆకుల శ్రీజ, ఫిడేల్ రఫీక్ స్నేహిత్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే ఈ పోటీల్లో జూనియర్స్ (అండర్-18); క్యాడెట్ (అండర్-15) విభాగాల్లో టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌ను నిర్వహిస్తారు. శ్రీజ జూనియర్ విభాగంలో... నైనా, స్నేహిత్ క్యాడెట్ విభాగాల్లో బరిలోకి దిగుతారు. ఈ పోటీల్లో ఆతిథ్య భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనీస్ తైపీ, థాయ్‌లాండ్, ఉత్తర కొరియా, తుర్క్‌మెనిస్థాన్, జోర్డాన్, కజకిస్థాన్, ఇరాన్, బహ్రెయిన్, హాంకాంగ్, ఖతార్, జట్లు పాల్గొంటున్నాయి. టీమ్ విభాగంలో టాప్-5లో నిలిచిన జట్లు ఈ ఏడాది చివర్లో చైనాలో జరిగే ప్రపంచ జూనియర్ టీటీ పోటీలకు అర్హత సాధిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement