రెండో రౌండ్‌లో సానియా జోడి | Sania Mirza advances to round two in Rogers Cup doubles | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సానియా జోడి

Published Thu, Aug 8 2013 2:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

రెండో రౌండ్‌లో సానియా జోడి

రెండో రౌండ్‌లో సానియా జోడి

టొరంటో (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-జెంగ్ జీ (చైనా) జోడి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-జెంగ్ జీ జంట 4-6, 7-6 (7/5), 10-2తో నటాలీ గ్రాన్‌డిన్ (దక్షిణాఫ్రికా)-దరియా జురాక్ (క్రొయేషియా) ద్వయంపై గెలిచింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తదుపరి రౌండ్‌లో ఈ ఇండో-చైనా జోడి ఒక్సానా కలష్నికోవా (జార్జియా)-అలిసియా రొసాల్‌స్కా (పోలండ్) జంటతో తలపడుతుంది.
 
 బోపన్న జంట ఓటమి
 ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-బెగెమన్ (జర్మనీ) జోడి 6-7 (4/7), 4-6తో ఇంగ్లోట్ (బ్రిటన్)-జనోవిజ్ (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement