బిజీ షెడ్యూల్ వల్లే ప్రత్యేక విమానం అడిగాం
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు సానియా మీర్జా ఎలాంటి డబ్బూ అడగలేదని, తర్వాతి రోజే గోవాలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరామని సానియా ఏజంట్‌గా వ్యవహరిస్తున్న క్వాన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ముందే అంగీకరించిన కార్యక్రమం కోసం సానియా గోవా వెళ్లాల్సి ఉంది. దీనికి సమయం సరిపోదు కాబట్టి... భోపాల్ నుంచి గోవా వెళ్లే ప్రయాణం కోసం విమానం ఏర్పాటు చేయమని కోరాం. ఈ కార్యక్రమం కోసం ఏ ఇతర కోరికలూ కోరలేదు’ అని ఆ సంస్థ ప్రకటించింది.