ప్రత్యేక విమానం... మేకప్ కిట్‌కు రూ. 75 వేలు! | MP dumps Sania after her demand for jet, make-up kit | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానం... మేకప్ కిట్‌కు రూ. 75 వేలు!

Published Thu, Dec 3 2015 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ప్రత్యేక విమానం... మేకప్ కిట్‌కు రూ. 75 వేలు!

ప్రత్యేక విమానం... మేకప్ కిట్‌కు రూ. 75 వేలు!

సానియా మీర్జా డిమాండ్  
నిర్ఘాంతపోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

 
భోపాల్: అది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వార్షిక క్రీడా అవార్డుల కార్యక్రమం... ఈ ఏడాది టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించిన క్రీడా శాఖ ఆమెను సంప్రదించి ఆదివారం ప్రోగ్రాం ఖరారు చేసింది. ‘అతిథి పాత్ర’ కోసం కూడా ఆమెకు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో స్పష్టంగా తెలియకపోయినా... అది కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. అయితే సరిగ్గా ఈ కార్యక్రమానికి ముందు రోజు కొత్త డిమాండ్లు సానియా వైపునుంచి రావడంతో అధికారులు తెల్లబోయారు.
 
తనను భోపాల్‌కు తీసుకువచ్చి తిరిగి తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేక విమానం, మేకప్ కిట్ కోసం రూ. 75 వేలు, తన ఐదుగురు సిబ్బందికి బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలని ఆమె కోరింది! సానియా వ్యక్తిగత సహాయకుడి నుంచి ఈ సమాచారం క్రీడాశాఖకు అందింది. దాంతో వారు తమ వల్ల కాదంటూ సానియాను పిలవాలనే ఆలోచనకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
 
హడావుడిగా కార్యక్రమాన్ని మంగళవారానికి వాయిదా వేయడంతో పాటు ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ఖరారు చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర క్రీడామంత్రి యశోధర్ రాజె మండి పడ్డారు. క్రీడాకారిణిగా సానియా పట్ల గౌరవం ఉన్నా, ఆమె డిమాండ్లు అంగీకార యోగ్యం కావన్న ఆమె... నిబంధనల ప్రకారం సానియాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మరో వైపు దీనిపై సానియా తరఫునుంచి ఎవరూ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement