
కోల్‌కతా: మోకాలి గాయం కారణంగా వచ్చే నెలలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది. ‘గాయం తీవ్రంగా ఉంది. నడకకు ఇబ్బందేం లేదు. ఆడే సమయంలో మాత్రం బాగా నొప్పి కలుగుతోంది. వైద్యులు రెండు నెలలు విరామం తీసుకోమని సూచించారు. అనంతరం పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు’ అని ఆమె శనివారం కోల్‌కతాలో పేర్కొంది.