
కరాచీ: పాకిస్తాన్ కెప్టెన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనత అందుకున్నాడు. కరాచీ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సర్ఫరాజ్‌కు కెప్టెన్‌గా 50వ వన్డే మ్యాచ్. 50 వన్డేలకి కెప్టెన్సీ వహించిన సర్ఫరాజ్.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక అత్యధిక వన్డేలకు కెప్టెన్సీ వహించిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. ఎంఎస్ ధోనీ 2007 నుండి 2018 వరకు 200 వన్డేల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు.
200 వన్డేలకి కెప్టెన్సీ వహించిన ధోని.. భారత జట్టుకు 110 విజయాలు అందించాడు. ఇక 74 పరాజయాలు ఉండగా.. 16 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 50 వన్డేలకి నాయకత్వం వహించిన సర్ఫరాజ్.. తన జట్టుకు 28 మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. 20 మ్యాచ్‌ల్లో పాక్ ఓడిపోగా.. రెండింటిలో ఫలితం తేలలేదు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేయగా, దాన్ని పాకిస్తాన్ 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫకార్ జమాన్(76), అబిద్ అలీ(74), హారిస్ సొహైల్(56)లు హాఫ్ సెంచరీలు సాధించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment