యూఎస్ ఓపెన్ లో సెరెనా 'హ్యాట్రిక్' | Serena Williams Hat Trick in Wins US Open | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్ లో సెరెనా 'హ్యాట్రిక్'

Published Mon, Sep 8 2014 4:20 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

యూఎస్ ఓపెన్ లో సెరెనా 'హ్యాట్రిక్' - Sakshi

యూఎస్ ఓపెన్ లో సెరెనా 'హ్యాట్రిక్'

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ‘హ్యాట్రిక్’ సాధించింది. వరుసగా మూడోసారి టైటిల్ చేజిక్కించుకుంది. సొంతగడ్డపై జరిగిన తుదిపోరులో స్నేహితురాలిని ఓడించి కెరీర్ లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది ఈ నల్లకలువ.

ఆదివారం అర్థరాత్రి దాటిన జరిగిన తర్వాత ఫైనల్లో డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాను వరుస సెట్లలో ఓడించింది. 6-3, 6-3తో వొజ్నియాను కంగుతినిపించింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్ అందుకోవాలనుకున్న వొజ్నియా ఆశలపై నీళ్లు చల్లింది. కాగా, ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement