నదీమ్‌కు 5 వికెట్లు  | Shankar slams ton, Nadeem impresses again | Sakshi
Sakshi News home page

నదీమ్‌కు 5 వికెట్లు 

Published Fri, Sep 28 2018 2:05 AM | Last Updated on Fri, Sep 28 2018 2:05 AM

Shankar slams ton, Nadeem impresses again - Sakshi

చెన్నై: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీలో జార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ జోరు కొనసాగుతోంది. ఇటీవల రాజస్తాన్‌తో మ్యాచ్‌లో (8/10) ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా గురువారం జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటడంతో జార్ఖండ్‌ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌... అనుకూల్‌ రాయ్‌ (72 బంతుల్లో 96 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది.

రాయ్‌ మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోవడంతో జార్ఖండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్ముకశ్మీర్‌ జట్టు నదీమ్‌ (5/17) ధాటికి 42.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. 76 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చివర్లో ముదస్సిర్‌ (28 బంతుల్లో 53; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో అసోం (204 ఆలౌట్‌) పై 130 పరుగుల తేడాతో తమిళనాడు (334/4) గెలిచింది.  రాజస్తాన్‌ (157 ఆలౌట్‌)పై 147 పరుగుల తేడాతో హరియాణా (304 ఆలౌట్‌) నెగ్గింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో 1000 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం.  ఫస్ట్‌క్లాస్, లిస్ట్‌ ‘ఎ’, టి20 మ్యాచ్‌లలో కలిపి అతను ఈ ఘనత సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement