
జకార్తా : ఏషియన్ గేమ్స్-2018లో భారత్ బోణి కొట్టింది. 18వ ఎడిషన్ ఏషియాడ్‌లో భారత్ కాంస్యంతో పతాకాల వేటను ప్రారంభించింది. తొలి రోజు ఈవెంట్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవి కుమార్, అపూర్వీ చండేలా కాంస్యం పతకం సాధించి భారత్‌కు శుభారంభాన్ని అందించారు.
ఫైనల్లో 429.9 స్కోర్ సాధించి మూడోస్థానాన్ని దక్కించుకున్నారు. 494.1 స్కోర్‌తో చైనీస్ తైపీ (తైవాన్) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. 492.5 స్కోర్‌తో చైనా రజతం దక్కించుకుంది. ఇక 10 మీటర్ల మిక్స్‌డ్ ఏయిర్ పిస్టోల్ విభాగంలో మనూభాస్కర్, అభిషేక్ వర్మలు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment