ఫిజౌ (చైనా): భారత స్టార్ షట్లర్ పివి సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో సింధు 11-21, 10-21 తేడాతో గావో ఫాంగ్జి(చైనా) చేతిలో ఓటమి పాలైంది.
తొలి గేమ్ ను భారీ తేడాతో కోల్పోయిన సింధు.. రెండో గేమ్ లో కూడా అదే ఆట తీరును పునరావృతం చేసి మ్యాచ్ ను చేజార్చుకుంది. దాంతో వరుసగా రెండోసారి టైటిల్ పై సింధు పెట్టుకున్న ఆశలకు క్వార్టర్స్ లోనే గండిపడింది. 2016లో సింధు తొలిసారి చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment