
ఎఫ్1 దిగ్గజం సర్ జాక్ బ్రాబమ్ కన్నుమూత
సిడ్నీ: ఫార్ములావన్ గ్రేట్‌గా పేరు ప్రతిష్టలు సాధించిన సర్ జాక్ బ్రాబమ్ సోమవారం కన్నుమూశారు. 88 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్స్ సాధించడమే కాకుండా తాను సొంతంగా తయారుచేసుకున్న కారులోనే రేసులో విజేతగా నిలిచిన ఏకైక డ్రైవర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. 1955 నుంచి 1970 వరకు కెరీర్ కొనసాగించిన జాక్ 14 రేసుల్లో విజేతగా నిలువగా 31 పోడియంలు, 13 పోల్ పొజిషన్‌లు సాధించారు. అలాగే మోటార్‌స్పోర్ట్స్‌కు అందించిన సేవలకు గాను నైట్‌హుడ్ (1979లో) బిరుదు పొందిన తొలి ఎఫ్1 డ్రైవర్ జాక్.