
వరుసగా ఐదుసార్లు అర్ధసెంచరీలు
ట్రెంట్‌బ్రిడ్జ్: సంచలనాలకు నెలవుగా మారిన ఇంగ్లీషు క్రికెట్ జట్టు మరో రికార్డు సృష్టించింది. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు(444) చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. పాకిస్థాన్ తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. అలెక్స్ హేల్స్ సంచలన ఇన్నింగ్స్ కు బట్లర్, జో రూట్, మోర్గాన్ మెరుపులు తోడవడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో హేల్స్ శతకం బాదగా, బట్లర్, జో రూట్, మోర్గాన్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. హేల్స్ కు ‘మ్యాన్ ది మ్యాచ్’ దక్కింది.
మ్యాచ్ విశేషాలు
* ఇంగ్లండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హేల్స్(171) నిలిచాడు. రాబిన్ స్మిత్(167) పేరున ఉన్న రికార్డును హేల్స్ తన పేరిట లిఖించుకున్నాడు.
* ఏడు ఇన్నింగ్స్ లో హేల్స్ సెంచరీ చేయడం ఇది మూడోసారి. తర్వాత అతడు మొదటి సెంచరీ సాధించడానికి 27 ఇన్నింగ్స్ వరకు ఆగాల్సి వచ్చింది.
* రెండు వికెట్ కు ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు జోడించిన చేసిన(750) చేసిన ఘనత హేల్స్, రూట్ కు దక్కింది. అంతకుముందు ఈ రికార్డు బెల్, ట్రాట్(740) పేరిట ఉంది.
* ఆరుగురు బ్యాట్స్మన్లు (రూట్, బాయ్కాట్, గోచ్, స్టివార్ట్, ట్రాట్, హేల్స్ వరుసగా ఐదుసార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించారు.
* రెండు టెస్టు దేశాల మధ్య జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ సాధించిన స్కోరే(444) అత్యుత్తమం. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా(439) పేరిట ఉండేది. గతేడాది జోహెన్నెస్బర్గ్ లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో సౌతాఫ్రికా ఈ స్కోరు చేసింది.