జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ కొంత పోరాటపటిమ కనబరుస్తోంది. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (35), మసూద్ (37), అజహర్ (15) ఔట్ కాగా... అసద్ షఫీఖ్ (48 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆ జట్టు మరో 228 పరుగులు చేయాల్సి ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 135/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డి కాక్ (138 బంతుల్లో 129; 18 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించగా, హషీం ఆమ్లా (71; 14 ఫోర్లు) రాణించాడు. షాదాబ్, ఫహీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన స్టెయిన్ (433) అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment