
సెంచూరియన్: బౌలర్ల విజృంభణతో... శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ క్వింటన్ డి కాక్ (94; 17 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ డు ప్లెసిస్ (57; 7 ఫోర్లు) రాణించారు. అనంతరం శ్రీలంక 32.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ (3/43) మూడు వికెట్లు తీయగా... ఇన్‌గిడి (2/14), యాన్రిచ్ నోర్టె (2/25), ఇమ్రాన్ తాహిర్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment