న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి పాఠశాల స్థారుులో క్రీడలను ఓ పాఠ్యాంశంగా చేర్చాలనే ఆలోచన ఉందని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. ‘చాలా పాఠశాలల్లో క్రీడలను అసలు పట్టించుకోవడం లేదు.
పిల్లలకు ఆడుకునేందుకు సమయం ఇవ్వడంతో పాటు క్రీడలను పాఠ్యాంశంగా చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఉండటం తప్పనిసరి చేయబోతున్నట్లు చెప్పారు.