
ముంబై: ఇండియన్ ప‍్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాపార్డర్ విఫలం కావడంతో సన్‌రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన‍్నింగ్స్ తొలి బంతికే శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్‌తో కలిసి 34 పరుగులు జత చేసిన గోస్వామి(12) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్ విలియమ్సన్(24) కూడా ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకిబుల్ హసన్(12) పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్ మరింత ఇబ్బందుల్లో పడింది. ఆపై యూసఫ్ పఠాన్(24) ఫర్వాలేదనిపించడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకుంది. కాగా, చివర్లో హిట్టర్ బ్రాత్‌వైట్(43 నాటౌట్; 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో బ్రేవో రెండు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.