రాణించిన శ్రీలలిత్ | sri lalitha took four wickets | Sakshi
Sakshi News home page

రాణించిన శ్రీలలిత్

Published Wed, May 7 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

sri lalitha took four wickets

సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శ్రీలలిత్ (4/25), బ్యాటింగ్‌లో శ్రీకాంత్ (70) రాణించడంతో ఇక్బాల్ సీఏ జట్టు 207 పరుగుల భారీ తేడాతో వీపీ రాజు క్లబ్‌పై జయభేరీ మోగించింది. క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ అండర్-19 ఇంటర్ అకాడమీ టోర్నమెంట్‌లో మొదట ఇక్బాల్ జట్టు 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీపీ రాజు క్లబ్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. శ్రీలలిత్‌తో పాటు శివ (3/16), శ్రీకాంత్ (2/11) వీపీ రాజు క్లబ్ బ్యాట్స్‌మెన్ ముప్పుతిప్పలు పెట్టారు.
 
 మరో మ్యాచ్‌లో అర్షద్ ఆల్‌రౌండ్ మెరుపులతో ఉడిత్యాల్ క్రికెట్ అకాడమీ 33 పరుగుల తేడాతో ఏఏసీఏ (రెడ్) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉడిత్యాల్ జట్టు 40 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. అర్షద్ (54) అర్ధసెంచరీతో రాణించగా, రాజ్‌ఠాకూర్ 44 పరుగులు చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఏఏసీఏ 39.4 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. అరుణ్ దేవ (73) పోరాడినా ఫలితం దక్కలేదు. బౌలింగ్‌లోనూ రాణించిన ఉడిత్యాల్ ఆటగాడు అర్షద్ 3, అబ్రార్ 3 వికెట్లు తీశారు.
 
 అండర్-16 విభాగంలో సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్, రెడ్ జట్ల మధ్య గురువారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఫైనల్ పోరు జరుగనుంది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 స్పోర్ట్స్ సెంటర్: 155 (యశ్ గుప్తా 35, అహన్ రెడ్డి 31; కమల్ 3/13), ఎవర్‌గ్రీన్ సీఏ: 157/7 (నాగరాజు గౌడ్ 35; సూర్యమల్లు 4/42)
 ఇక్బాల్ సీఏ: 265/7 (వికాస్ 62, శ్రీకాంత్ 70; ప్రశాంత్ 3/35), వీపీ రాజు: 58 (శ్రీలలిత్ 4/25, శివ 2/16)
 చార్మినార్ సీఏ: 218/7 (జైన్ 88, అబ్దుల్ రెహ్మాన్ 37) అశ్విన్ సీఏ: 180/9 (ప్రజ్వల్ మనోత్ 74)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement