
కొలంబో:శ్రీలంక క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశాడు. శ‍్రీలంక మాజీ క్రికెటర్, బంగ్లాదేశ మాజీ కోచ్ చందికా హతురుసింఘాను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. భారత్‌తో మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో చందికా హతరురుసింఘా బాధ్యతలు చేపట్టనున్నాడని స్పష్టం చేసింది. హతరుసింఘాను కోచ్‌గా ఎంపిక చేసే క్రమంలో అతను కోచ్‌గా ఎంతవరకూ సక్సెస్ అయ్యాడనే దానిపై తీవ్రంగా చర్చించిన పిదప నిర్ణయం తీసుకున్నారు. చివరకు హతురుసింఘా నియామకంలో ఏకగీవ్ర ఆమోదం లభించడంతో అతనికి ఎంపికలో ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు.
ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ కోచ్ పదవికి హతురసింఘా రాజీనామా చేశారు. అతని పర్యవేక్షలో బంగ్లాదేశ్ అనేక సంచలన విజయాలు సాధించింది. ప్రధానంగా అతని మూడేళ్ల పదవి కాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను బంగ్లాదేశ్ ఓడించింది. 2006లో శ్రీలంక-ఎ జట్టకు హతురసింఘా కోచ్‌గా సేవలందించాడు. మరొకవైపు 2009లో శ్రీలంక జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అనుభవం అతని సొంతం.