జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బుధవారం 412 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్‌స ఆడిన జింబాబ్వే 90.3 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఆలౌటైంది. లంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
కెప్టెన్ క్రీమర్ (43), సీన్ విలియమ్స్ (40), మవోయో (37) ఫర్వాలేదనిపించారు. హెరాత్, పెరీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా, లక్మాల్, లహిరు కుమార తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్‌సల్లో శ్రీలంక 537, జింబాబ్వే 373 పరుగులు చేయగా, లంక రెండో ఇన్నింగ్‌సను 247/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 నుంచి రెండో టెస్టు ఇదే వేదికపై జరుగుతుంది.