స్టార్ గ్రూప్ నిర్ణయం
ముంబై: భారత్‌లో క్రికెట్‌కున్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఆటకు దీటుగా జాతీయ క్రీడగా పేరు తెచ్చుకున్న హాకీని కూడా పాపులర్ చేసేందుకు స్టార్ ఇండియా గ్రూప్ నడుం బిగించింది. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ క్రీడా చానెళ్ల సంస్థ ఏకంగా ఈ ఆటపై రూ.1500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.
‘భారత్‌లో క్రీడా ప్రసార సంస్థలు క్రికెట్‌లో మాత్రమే డబ్బులు వెచ్చిస్తాయి. ఇతర క్రీడలవైపు పెద్దగా దృష్టి సారించవు. అయితే ఈ దేశంలో క్రీడా ప్రాముఖ్యత మారేలా చూడడమే మా ఉద్దేశం. మేం సరైన చోటే డబ్బును ఖర్చు చేయనున్నాం. భారత్‌లో హాకీ మరింత ఎదిగే అవకాశం ఉంది. అయితే దానికి తగిన వనరులు కావాల్సి ఉంది. స్థానిక లీగ్స్, అంతర్జాతీయ ఈవెంట్స్, 2018లో హాకీ ప్రపంచకప్ ద్వారా అభిమానులకు ఈ ఆట మరింత చేరువయ్యే అవకాశం ఉంది’ అని స్టార్ ఇండియా హెడ్ ఆఫ్ బిజినెస్ నితిన్ కుక్రేజా తెలిపారు.
అలాగే శనివారం నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు ఈ మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్ ఇండియా గ్రూప్ రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. హాకీ చరిత్రలోనే తొలిసారిగా మ్యాచ్ సందర్భంగా 20 కెమెరాలను ఉపయోగించనుంది. స్టార్ స్పోర్ట్స్ 3 ద్వారా హిందీ కామెంటరీతో కూడా మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది.
హాకీలో రూ.1500 కోట్ల పెట్టుబడి
Published Fri, Jan 24 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement