విజయనగరం: ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు నేటి (బుధవారం) నుంచి వివిధ వేదికల్లో జరగనున్నాయి. విదర్భ, సౌరాష్ట్రల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు విజయనగరం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ మ్యాచ్‌తో గాడిలో పడాలని భావిస్తుండగా, టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా భారీ స్కోరుపై కన్నేశాడు. వాల్సాద్ (గుజరాత్)లో జరగనున్న క్వార్టర్‌ఫైనల్లో అస్సాం, పంజాబ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగాల్, మధ్యప్రదేశ్‌ల క్వార్టర్స్‌కు ముంబై ఆతిథ్యమివ్వనుంది. జార్ఖండ్, ముంబై మ్యాచ్‌కు మైసూర్ వేదిక కానుంది.