మెల్‌బోర్న్:దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై మాజీ అంపైర్ డరైల్ హార్పర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరికీ బాల్ ట్యాంపరింగ్ చేయడం కొత్తమే కాదంటూ విమర్శించాడు.
2016లో షెఫల్ షీల్డ్ టోర్నీలో భాగంగా తాను రిఫరీగా పని చేసిన ఓ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ జట్టుకు స్మిత్, వార్నర్ ఆడారని, అందులో వాళ్లిద్దరూ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించారన్నాడు. అప్పట్లో దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ రిఫరీ సైమన్ టౌఫెల్‌కు ఈమెయిల్ కూడా పంపానని హార్పర్ వెల్లడించాడు. దాంతో స్మిత్, వార్నర్‌ల తాజా టాంపరింగ్ ఉదంతం తనకు కొత్తగా ఏమీ అనిపించలేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment