కేప్‌టౌన్: బాల్ ట్యాంపరింగ్ చేయడంలో ‘మాస్టర్ మైండ్స్’ఎవరైనా ఉన్నారంటే అది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టేనేమో. ఆ జట్టు ట్యాంపరింగ్ చేయడానికి యత్నించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి రావడం అందుకు మరింత బలాన్నిచ్చింది. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులోనే ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తన షూ స్పైక్స్‌తో బంతిని నొక్కిపట్టడం వివాదాస్పదంగా మారింది. తొలిరోజు ఆట 53వ ఓవర్‌లో ప్రొటీస్ ఆటగాడు డీన్ ఎల్గర్‌కు వేసిన బంతి డిఫెన్స్ ఆడడంతో తిరిగి అది కమిన్స్ దగ్గరికే వచ్చింది. దీన్ని అతడు షూస్‌తో ఆపడంతో పాటు తన ఎడమకాలి స్పైక్స్‌తో కొన్ని సెకన్లపాటు బలంగా అదమడం వీడియోలో కనిపించింది.
ఈ ఉదంతాన్ని అప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అంపైర్లు కూడా బంతిని పరిశీలించి ఆటను కొనసాగించారు. కానీ కామెంటేటర్ గ్రేమ్ స్మిత్ మాత్రం ‘ఉద్దేశపూర్వకంగా.. అనుకోకుండా చేసింది’ అని వ్యంగ్యంగా అన్నాడు. మరోవైపు ప్రెస్ మీట్‌లో కమిన్స్ మాట్లాడుతూ.. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని సమర్థించుకున్నాడు. ఈ టెస్టు సిరీస్ మూడో మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే కమిన్స్ వ్యవహారాన్ని అంపైర్లు సీరియస్‌గా పరిగణించకపోవడంతో అతనిపై ఎటువంటి చర్యలు లేకుండా సేఫ్‌గా బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment