
స్టీవ్‌స్మిత్ (ఫైల్ ఫొటో)
సిడ్నీ : బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన మంచితనాన్ని చాటుకున్నాడు. నిషేదం ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్‌తో పాటు స్మిత్ కెనడా టీ20 లీగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ద్వారా తాను ఆర్జించే మొత్తాన్ని క్రికెట్ ప్రచారా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు ఈ ఆసీస్ మాజీ సారథి ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆ కథనం మేరకు స్మిత్ విరాళాలను ఆస్ట్రేలియా, కెనడాలోని క్రికెట్ ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు.
ఈ నెల 28 నుంచి ప్రారంభమ్యే ఈ లీగ్‌లో స్మిత్ పాల్గొంటాడని ఇప్పటికే నిర్వాహకులు సైతం స్పష్టం చేశారు. లీగ్ ఒప్పందం ప్రకారం స్మిత్ కెనడాలో శిక్షణా క్యాంపులకు హాజరవ్వడమే కాకుండా ఆ దేశ క్రీడల కోసం నిర్వహించే ప్రచారకార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. కెనడా పట్టణాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఆరో జట్టు క్రికెట్ వెస్టిండీస్ తరుపున బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సూత్రదారి అయిన డేవిడ్ వార్నర్, జట్టు వ్యూహమని చెప్పిన స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధిస్తూ చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment