స్టీవ్ స్మిత్ కు స్వల్ప విరామం | Steve Smith off to Dubai for short break ahead of match vs Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్ కు స్వల్ప విరామం

Published Thu, Apr 20 2017 5:32 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

స్టీవ్ స్మిత్ కు స్వల్ప విరామం

స్టీవ్ స్మిత్ కు స్వల్ప విరామం

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్ ఈ టోర్నీకి కొన్ని రోజులు దూరం కానున్నాడు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళ్లనున్న స్మిత్ కొన్ని మ్యాచ్ లకు దూరమవుతున్నాడు.ఈ విషయాన్ని స్టీవ్ స్మిత్ తాజాగా వెల్లడించాడు. 'కుటుంబ సభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నాను. ఈ మేరకు ఆరు రోజుల పాటు ఐపీఎల్ కు దూరమవుతున్నా'అని స్మిత్ తెలిపాడు.


ఐపీఎల్ ప్రారంభానికి ముందు గవాస్కర్-బోర్డర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించింది. ఆపై కొంతమంది ఆసీస్ క్రికెటర్లు నేరుగా ఐపీఎల్లో పాల్గొన్నారు. అందులో స్మిత్ ఒకడు. ఆ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గడిపేందుకు దుబాయ్ పయనమవుతున్నాడు స్మిత్. ఆరు రోజుల పాటు ఐపీఎల్ కు దూరం కానున్న నేపథ్యంలో రెండు ఐపీఎల్ మ్యాచ్ లకు స్మిత్ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు మాత్రం స్మిత్ అందుబాటులో ఉండటం లేదు.  ఈ సీజన్ లో ఇప్పటివరకూ పుణె జట్టు ఐదు మ్యాచ్ లు ఆడగా రెండింట మాత్రమే  విజయం సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement