గెలుపు ఎవరిదో? | Sunrisers upbeat before RCB challenge | Sakshi
Sakshi News home page

గెలుపు ఎవరిదో?

Published Fri, May 15 2015 5:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

గెలుపు ఎవరిదో?

గెలుపు ఎవరిదో?

సొంత మైదానంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం మరో పోరుకు సిద్ధమైంది.

హైదరాబాద్: సొంత మైదానంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం మరో పోరుకు సిద్ధమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈరోజు మ్యాచ్ లో నెగ్గితే హైదరాబాద్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

కోహ్లి సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. 13 పాయింట్లతో కొనసాగుతున్న బెంగళూరు ఈ మ్యాచ్ లోనూ, తర్వాతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలకు పోకుండా నేరుగా ప్లేఆఫ్ లో అడుగు పెడుతుంది. బలాబలాల విషయంలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. కీలమైన ఈ మ్యాచ్ లో గెలుపు కోసం రెండు టీమ్ లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement